పురపాలక ఎన్నికల వేళ వైకాపాలో విభేదాలు తలెత్తాయి. గుంటూరు కార్పొరేషన్ 26వ డివిజన్ టిక్కెట్‌ను బ్రహ్మారెడ్డి అనే వ్యక్తికి ఇవ్వొద్దంటూ కొందరు మహిళలు.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బ్రహ్మారెడ్డికి బదులు అంకమ్మరావు, వెంకటరెడ్డిలలో ఒకరికి టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ దశలో మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి మహిళలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. పార్టీలో ఈ విషయాన్ని చర్చించి.. ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామని వేణుగోపాల రెడ్డి హామీ ఇచ్చారు.
కార్పొరేటర్ టికెట్ విషయంలో వైకాపాలో విభేదాలు - గుంటూరు వైకాపా తాజా వార్తలు
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైకాపాలో విభేదాలు చెలరేగాయి. గుంటూరు కార్పొరేషన్ డివిజన్ టికెట్ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తికి ఇవ్వొద్దంటూ మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి ఇంటి ఎదుట నిరసన చేపట్టారు.
కార్పొరేటర్ టికెట్ విషయంలో వైకాపాలో విభేదాలు