గుంటూరు జిల్లా నెహ్రూనగర్‌లోని ఓ పాఠశాల భవనం రెండో అంతస్తుకు... వైకాపా రంగులు వేసిన విషయంలో అధికారులు తప్పు సరిదిద్దుకున్నారు. పాఠశాల పై అంతస్తులో సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించి... భవనం మొత్తాన్ని వైకాపా రంగులతో నింపేశారు. ఒకేసారి రంగు మారిన విషయాన్ని ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రసారం చేశాయి. పాఠశాల నిర్వహించే తరగతి గదులకు పార్టీ రంగులు అద్దటంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తంచ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు మొత్తం భవనానికి తెలుపు రంగులు వేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. పాఠశాల భవనం రంగు మారింది - ycp colors change in guntur school news
గుంటూరులో పాఠశాల భవనం రంగులను అధికారులు మార్చారు. సచివాలయ భవనానికి వైకాపా రంగులు వేయడంపై ఈటీవీ, ఈటీవీ భారత్ వరుస కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై స్పందించిన అధికారులు తప్పును సరిదిద్ది.. భవనానికి తెలుపు రంగులు వేశారు.
ycp-colors-change-in-guntur-school