ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 22, 2020, 5:55 AM IST

ETV Bharat / state

'చట్ట సవరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం కదం తొక్కాలి'

కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న కొద్దిపాటి చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ.. చట్ట సవరణలు చేసిందని కార్మిక సంఘం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.శేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం ఈనెల 26న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

'చట్ట సవరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం కదం తొక్కాలి'
'చట్ట సవరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం కదం తొక్కాలి'

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపు నిచ్చాయి. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్​లో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న కొద్దిపాటి చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ.. చట్ట సవరణలు చేసిందని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.శేఖర్ రెడ్డి విమర్శించారు. ఈ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మికవర్గం కదంతొక్కాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details