ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛను ఇవ్వలేదని.. పంచాయతీ కార్యదర్శిపై మహిళ దాడి - పంచాయతీ కార్యదర్శి

పింఛను ఇవ్వడం లేదంటూ... కుమారుడితో సహా వెళ్లి పంచాయతీ కార్యదర్శిపై ఓ మహిళ దాడి చేసింది. తనతో.. ఆ అధికారి అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పింఛను ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శిపై మహిళ దాడి

By

Published : Aug 11, 2019, 11:29 AM IST

పింఛను ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శిపై మహిళ దాడి

గుంటూరు జిల్లా బెల్లంకొండ పంచాయతీ కార్యదర్శి దుర్గారావుపై.. ఓ మహిళ దాడి చేసింది. వితంతు పింఛను మొత్తాన్ని ఇంటికి తెచ్చి ఇవ్వాలంటూ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అలా కుదరదని... కార్యదర్శి చెప్పగా... కార్యాలయానికి కుమారుడితో కలిసి వెళ్లి దుర్గారావుపై దాడి చేసింది. ఈ మేరకు బెల్లంకొండ పోలీస్‌ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. పింఛను కోసం వెళ్లిన తనతో... దుర్గారావే అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details