ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Woman Raped and Murdered: గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం.. పోలీసుల అదుపులో అనుమానితులు - మహిళపై హత్యాచారం వార్తలు

Woman raped and murdered: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో.. ఓ మహిళపై హత్యాచారం జరిగింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మృతురాలి ఒంటిపై ఉన్న గాయాలను చూసిన పోలీసులు.. అత్యాచారం జరిగిందని నిర్థరణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులకు తెనాలి ఐతానగర్​కు చెందిన కొంతమంది నాయకుల మద్దతు ఉందని.. మృతురాలి భర్త ఆరోపించారు. ఘటనపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. జిల్లా ఎస్పీని ఆదేశించారు.

woman raped and murdered in duggirala at guntur
గుంటూరులో మహిళపై హత్యాచారంd murdered in duggirala at guntur

By

Published : Apr 28, 2022, 10:00 AM IST

Updated : Apr 28, 2022, 8:55 PM IST

Vasireddy and Minister Nagarjuna : దుగ్గిరాల హత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని మంత్రి నాగార్జున,మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు సుచరిత, రామకృష్ణారెడ్డిలు పరామర్శించారు. తెనాలి ఆసుపత్రిలో మృతురాలి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు.

Woman raped and murdered: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యువతిపై అత్యాచారం ఘటన మరవక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో దారుణం జరిగింది. బుధవారం మధ్యాహ్నం వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ (40)పై హత్యాచారం జరిగింది. మృతదేహంపై గాయాలు గుర్తించి అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు.. తిరుపతమ్మ బంధువైన ఓ యువకుడు ఆమెను కలవడానికి వెళ్లాడు. తిరుపతమ్మ అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన ఆ యువకుడు.. వెంటనే పోలీసులకు, 108కు సమాచారమిచ్చాడు. తిరుపతమ్మకు శ్రీనివాసరావు అనే వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు.

శ్రీనివాసరావు పనుల కోసం గ్రామం విడిచి వెళుతుంటాడు. ఒకసారి వెళ్తే ఐదు, ఆరు నెలలు ఇంటికి రారు. గతేడాది డిసెంబర్ లో.. ఆయన పనులు కోసం ఇంటి నుంచి వెళ్లారు. తాను ఉపాధి కోసం తిరుపతిలో పనికి వెళ్లినట్లు తెలిపిన శ్రీనివాసరావు.. తాను ఇంటి వద్ద లేనప్పుడు ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది.

వీరంకి శివరామకృష్ణ, మరీదు సాయి, కొర్రపాటి సాయి చరణ్.. అనే ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టారు. బుధవారం రాత్రి ఈ ఘటనపై దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో అనుమానితులు పేర్లతో ఫిర్యాదు చేయడానికి తాము వెళ్లాం. పేర్లు వద్దు అనుమానం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

-శ్రీనివాసరావు, మృతురాలి భర్త

ఈ కేసులో నిందితులకు తెనాలి ఐతానగర్ కు చెందిన కొంతమంది నాయకులు మద్దతు ఉందని శ్రీనివాసరావు ఆరోపించారు. ఉపాధి కోసం తిరుపతిలో పనికి వెళ్లినట్లు తెలిపిన భర్త.. తాను ఇంటి వద్ద లేనప్పుడు ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.

నేరస్థులకు కఠిన శిక్షలు వేయాలి..గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారం , హత్య దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి బలిగొన్న మృగాళ్లని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జగన్ రెడ్డి అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని దుయ్యబ్టటారు. దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళపై అఘాయిత్యం జరిగిందని ఆరోపించారు.

రేపిస్టులని ఉరి తీయాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇవ్వడం, కేసులు నమోదు చేయడం తాలిబన్ల పాలనను తలపిస్తోందన్నారు. అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితులని ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు.

తెనాలి ఆస్పత్రి వద్ద ఆందోళనలు.. మహిళపై అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ.. మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. తెనాలి ప్రభుత్వాసుపత్రి వద్ద సీపీఎం, జనసేన, ఐద్వా నాయకులు ఆందోళనకు దిగారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దిశ చట్టం పేరుతో ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప నిందితులకు శిక్షలు పడటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ మహిళలకు భరోసా కల్పించ లేకపోతోందని విమర్శించారు. మృతురాలి కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని.. పిల్లలను ప్రభుత్వ చదివించాలని డిమాండ్ చేశారు.

మహిళా కమిషన్ స్పందన.. హత్యాచారం ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు చేపట్టాలని.. జిల్లా ఎస్పీని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. మృతురాలి కుటుంబసభ్యులను.. ఫోన్‌లో పరామర్శించారు.

వివాహితపై అత్యాచారం, హత్య చేసిన దుండగులపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం, హత్య చేయడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం.. పోలీసుల అదుపులో అనుమానితులు


కన్నతల్లిపై కొడుకు కర్కశత్వం... మద్యం మత్తులో గొంతు నులిమి హత్యఇదీ చదవండి:

Last Updated : Apr 28, 2022, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details