ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా హోటల్ స్థలాన్ని వైకాపా కార్యకర్త ఆక్రమించాడు.. న్యాయం చేయండి'

జీవనాధారమైన హోటల్‌ స్థలాన్ని వైకాపా కార్యకర్త ఆక్రమించాడని... గుంటూరు జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన బాధితురాలు.. తమకు న్యాయం చేయాలని కోరుతోంది.

woman protest against ycp leader in gunturu district
woman protest against ycp leader in gunturu district

By

Published : Nov 25, 2020, 9:14 AM IST

Updated : Nov 25, 2020, 4:16 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం.. సాతులూరుకు చెందిన ఓ మహిళ.. వైకాపా కార్యకర్త తీరుపై ఆందోళనకు దిగింది. తమకు జీవనాధారమైన హోటల్ స్థలాన్ని వైకాపా కార్యకర్త కృష్ణారెడ్డి ఆక్రమించారని నిర్వాహకురాలు మాలతి పురుగుమందు డబ్బాతో ఆత్మహత్యకు యత్నించింది. కుమార్తె తో పాటు గ్రామస్తులు వారించి డబ్బాను లాగేసుకున్నారు. నాదెండ్ల మండలం సాతులూరులో తమ జీవనాధారమైన హోటల్ స్థలాన్ని వైకాపా కార్యకర్త కృష్ణారెడ్డి ఆక్రమించాడని నిర్వహకురాలు మాలతి మంగళవారం ఆత్మహత్యయత్నం చేసింది.

గ్రామ పరిధిలో అనంతపురం-అమరావతి హైవే పక్కన నలభై ఏళ్లగా తమ కుటుంబ సభ్యులు హోటల్ నిర్వహిస్తున్నామని, పక్కనే స్థలాన్ని కొన్న కృష్ణారెడ్డి తమ స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించాడని వాపోయింది. పురుగు మందు తాగేందుకు ప్రయత్నించిన ఆమె దగ్గర నుంచి కుమార్తె, పెద్దలు డబ్బాను లాగేసి వారించారు.

ఆందోళన చేస్తున్న బాధితులు
Last Updated : Nov 25, 2020, 4:16 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details