ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతలకు తగ్గిన వరదనీరు.. సాయంత్రం గేట్లు మూసే అవకాశం! - పులిచింతల ప్రాజెక్ట్ వార్తలు

పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు తగ్గింది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు 28వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నీరు తగ్గటంతో సాయంత్రానికి గేట్లు మూసివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

water flow in pulichinthala reservoir
పులిచింతల ప్రాజెక్ట్

By

Published : Oct 5, 2020, 1:48 PM IST

పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 33 వేల 648 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు 28వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలుకాగా... ప్రస్తుత 45.61 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు వివరించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కులు కేటాయించారు. ప్రస్తుతం సాగర్ నుంచి కూడా ఇన్ ఫ్లో తగ్గుతుండటంతో సాయంత్రానికల్లా గేట్లన్నీ మూసివేసే అవకాశముంది. జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details