ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాకాలాపాడులో జనసేన, వైకాపా మధ్య వాగ్వాదం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పాకాలపాడు గ్రామంలో జనసేన, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా....వైకాపా మద్దతుదారులు అడ్డుకున్నారు.

By

Published : Apr 8, 2019, 6:32 AM IST

జనసేన, వైకాపా మధ్య వాగ్వాదం

జనసేన, వైకాపా మధ్య వాగ్వాదం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పాకాలపాడు గ్రామంలో జనసేన, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా....వైకాపా మద్దతుదారులు అడ్డుకున్నారు. వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు ఓట్లు చీల్చేందుకే ఎన్నికల్లో నిలబడ్డావని.... రెడ్డి సామాజికవర్గం అయి ఉండి...జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా కుట్రలు చేస్తున్నావని వెంకటేశ్వరెడ్డిపై ఘర్షణకు దిగారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది గ్రామస్థులు జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో జనసేన కార్యకర్తలు హేమంతు, కోటేశ్వరరావులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్దసంఖ్యలో జనసైనికులు, మద్దతుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆందోళన చేశారు. సత్తెనపల్లి-గుంటూరు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు . పోలీసులు పాకాలపాడు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details