ఓటు హక్కు వినియోగించుకున్న మాధవీలత - guntur
గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి.. సీనీనటి మాధవీలత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు.. ఓటు వేసి మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆమె కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మాధవీలత
గుంటూరు లక్ష్మీపురంలోని ఓరియంటల్ స్కూల్ 93వ పోలింగ్ కేంద్రంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థి పసుపులేటి మాధవిలత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెతో పాటు.. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు జయప్రకాష్ ఓటేశారు.ప్రజల నుంచి తమకు మంచి స్పందన ఉందని మాధవీలత చెప్పారు. ప్రజలంతా ఓటు వేసి.. మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు.