ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో గుంటూరు బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేవారితో పల్నాడు సెక్టర్ బస్టాండు కిక్కిరిసిపోయింది. దసరా, సంక్రాంతి లాంటి ముఖ్యమైన పండుగ రోజుల్లో ఉండే రద్దీ కనిపిస్తోంది. ఐదేళ్లకు ఒకసారి వేసే ఓటును సరైన నాయకుడికి పడేలా వేయాలని.. మన భవిష్యత్తు బావుండేలా మనమే చూసుకోవాలని విద్యావంతులు, చైతన్యవంతులు సూచించారు.
'ఓటర్లతో' గుంటూరు బస్టాండ్ కిటకిట
రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండగ రద్దీ కొనసాగుతోంది. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఎక్కడ చూసినా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
'ఓటర్లతో' గుంటూరు బస్టాండ్ కిటకిట