చెరువు మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు - చెరువు మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు
చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టాడాన్ని గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోని మట్టిని వేరే ప్రాంతాలకు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు.
చెరువు మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాల జరుపుతున్న కొందరు వ్యక్తులను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువులో మట్టి తీసుకువెళ్లడానికి వీలులేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గుంటూరు నగరశివారు ప్రాంతాలలో పేదల ప్లాట్ల కోసం సేకరించిన భూముల చదును కోసం మట్టి తవ్వుతున్నామని చెప్పగా... వేరే ప్రాంత అవసరాలకు మా గ్రామంలో చెరువు మట్టి ఎలా తరలిస్తారని నిరసన చేపట్టారు.