ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jobs To Students: వెయ్యి మంది విజ్ఞాన్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

Jobs to Vignan varsity students: గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులు 1600 ఉద్యోగావకాశాలు సాధించారు.

vignan university 1000 students got employment
vignan university 1000 students got employment

By

Published : Dec 31, 2021, 9:21 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులు 1600 ఉద్యోగావకాశాలు సాధించారని విజ్ఞాన్‌ ఇన్‌ఛార్జి ఉపకులపతి కేవీ కృష్ణకిషోర్‌ గురువారం వెల్లడించారు. ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నిర్వహించిన అభినందన సభలో విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య మాట్లాడారు. కొందరు విద్యార్థులకు రెండు నుంచి మూడు ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు. నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఉండగానే 75 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని వెల్లడించారు.

200 మందికి 6.7లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనం, 600 మంది విద్యార్థులకు రూ.4 లక్షల నుంచి రూ.6.75 లక్షల వార్షిక వేతనం, మిగిలిన విద్యార్థులు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారని వివరించారు. ప్రముఖ బహుళజాతి సంస్థలైన టీసీఎస్‌, సీటీఎస్‌, ఐబీఎం, అసెంచర్‌, హెచ్‌సీఎల్‌, ఐటీసీ, పీడబ్ల్యూసీ, సిస్కో, హెక్సావేర్‌, అకోలైట్‌, కేకా వంటి కంపెనీలతో పాటు ఎస్‌బీఐ జీఐలో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Meeting on PRC: ఉద్యోగ సంఘాలతో చర్చలు.. పీఆర్సీపై వీడని ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details