గుంటూరు జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పెదపలకలూరు, నల్లపాడు, తుళ్ళూరు మండలం అనంతవరం తదితర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల నిర్వహణలో పలు లోపాలను గుర్తించి ఐసీడీఎస్ అధికారులను హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, హాజరు పట్టీలను సక్రమంగా నిర్వహించండంలేదని పరిశీలనలో వెల్లడైంది. బాలింతలకు పాలు, కోడిగుడ్లు మినహా మిగతా ఆహార పదార్థాల తయారీ మోనూకే పరిమితమైనట్లు గుర్తించారు. సీడీపీవో, సూపర్ వైజర్లు కేంద్రాలను సందర్శించడంలేదని విజిలెన్స్ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. కేంద్రాల నిర్వహణలోపాలపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలలో విజిలెన్స్ దాడులు
గుంటూరు జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు.
విజిలెన్స్ దాడులు