గుంటూరు జిల్లా ఈపూరు మండలం అగ్నిగుండాలలో వడదెబ్బతో పులిగుజ్జి అతికాంక్షణ అనే చిన్నారి మరణించింది. బాలిక తల్లి కూలి పనులకు వెళ్లగా.. చిన్నారి ఎండలో ఆడుకుంది. 46 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో వడదెబ్బ తగిలింది. సాయంత్రానికి వాంతులు చేసుకుని సొమ్మసిల్లి పడిపోయింది. చికిత్స కోసం వినుకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది.
వడదెబ్బకు నాలుగేళ్ల చిన్నారి మృతి - గుంటూరు జిల్లా
ఎండ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. వడదెబ్బకు తాళలేక నాలుగేళ్ల బాలిక మృత్యువాత పడింది. అప్పటివరకూ ఆడుకుంటున్న తమ బిడ్డ అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయిందంటూ.. తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
వడదెబ్బకు నాలుగేళ్ల చిన్నారి మృతి