ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్​ను వెంబడిస్తున్న అనుమానాస్పద వ్యక్తులు.. ఎందుకోసం..! - Nadendla Manohar

Unknown persons follow to pawan: విశాఖ ఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తున్నది అభిమానులు కాదని, వారి కదలికలు అనుమానించేలా ఉన్నాయని వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి తమ అధినేత ఇంటి వద్ద ముగ్గురు గొడవ చేశారని.. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో తెలంగాణ జనసేన నేత ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

pawan
pawan

By

Published : Nov 2, 2022, 10:47 PM IST

Updated : Nov 3, 2022, 6:52 AM IST

Unknown persons follow to pawan: పవన్ కల్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. విశాఖ ఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం వద్ద తిరుగుతున్నారని చెప్పారు. పవన్ ఇంటి నుంచి వెళ్లినపుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. పవన్‌ను ‌అనుసరిస్తున్నది.. ఆయన అభిమానులు కాదన్న నాదెండ్ల మనోహర్.. వారి కదలికలు అనుమానించేలా ఉన్నాయని చెప్పారు. మంగళవారం బైకులపై, ఇవాళ కారులో అనుసరించారని వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి తమ అధినేత ఇంటి వద్ద ముగ్గురు గొడవ చేశారన్న మనోహర్‌.. భద్రతా సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగారని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ను దుర్భాషలాడారని వివరించారు. ఘటనను భద్రతా సిబ్బంది వీడియో తీసినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ జనసేన నేతలు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

పవన్​ను వెంబడిస్తున్న అనుమానాస్పద వ్యక్తులు

పవన్ కల్యాణ్ ను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే సీఎం జగన్‌ దాడి చేయాలని కుట్రలు పన్నుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. కేంద్రం తక్షణమే పవన్ కల్యాణ్ కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2022, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details