ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వ బాధితుల శిభిరాన్ని సందర్శించిన లోకేష్

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వ బాధితులకు పునరావాస శిభిరాన్ని తెదేపా నేతలు లోకేష్, కళా వెంకట్రావులు సందర్శించారు. ఈ నెల 11 లోపు గ్రామాలు వీడిన తెదేపా కుటుంబాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లకపోతే, ఆందోళనను ఉధృతం చేస్తామని లోకేష్ హెచ్చరించారు.

Under the TeluguDesamParty, the YCP government has set up a rehabilitation center for the victims at guntur

By

Published : Sep 7, 2019, 1:11 PM IST

మీ కొడుకు అయితే ఇలానే కొడ్తారా? ...లోకేష్

గుంటూరులో ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వ బాధితులకు పునరావాస శిభిరాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,తెదేపా నేత కళా వెంకట్రావు సందర్శించారు.ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెదేపాకి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నారని,పిన్నెల్లిలో200మందిపై ఒక్కొక్కరి మీద4అక్రమ కేసులు పెట్టారని అన్నారు.వారికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.బాధిత కుటుంబాలకు రూ.10వేలు ఆర్థికసాయంగా అందిస్తున్నామని తెలిపారు.పిల్లలకు ఉన్నత విద్య కల్పిస్తామని వెల్లడించారు.గ్రామాలను వీడిన వారిని ఈ నెల11నాటికి తిరిగి వారిని గ్రామాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.తెదేపా కార్యకర్తలకు రక్షణ కల్పించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details