గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పోట్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, పార్వతి దంపతులకు గోపీచంద్, ఊర్మిళ సంతానం. గోపీ ఇంటర్ చదువుతుండగా.. ఊర్మిల బీటెక్ చదువుతోంది. మరో స్నేహితురాలితో కలిసి వీరిద్దరూ బైక్ పై వెళ్తుండగా మేడికొండూరు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గంటల వ్యవధిలోనే అక్కా, తమ్ముడు ప్రాణాలు విడిచారు.
ఇవీచదవండి.