మొసలిని చంపిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా మాచర్ల అటవీశాఖ అధికారి సయ్యద్ హుస్సేన్ తెలిపారు. రెంటచింతల మండలం పాశర్లపాడు గ్రామంలోని వాగులో స్థానికులు చేపలు పడుతుండగా.. వలలో మొసలి చిక్కింది.
భయభ్రాంతులకు గురైన స్థానికులు మొసలిని కొట్టి చంపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు... వారికి మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతం కోర్టులో హాజరు పరచనున్నారు.