గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరు గ్రామంలో బెట్టింగ్ భూతం విషాదం నింపింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో భారీగా నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు నాలుగు రోజుల క్రితం చనిపోగా... మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స అనుభవిస్తూ శనివారం కన్నుమూశాడు.
బెట్టింగ్ భూతానికి ఇద్దరు యువకులు బలి - guntur district latest news
బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు వేదన మిగిల్చారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
తాళ్లూరుకు చెందిన సురేష్, బెల్లంకొండలోని బుడగజంగాల కాలనీకి చెందిన కొమరయ్య సోమవారం మధ్యాహ్నం బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. దారిలో పురుగుల మందు తాగారు. క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయామని, బెట్టింగ్ నిర్వాహకుడు డబ్బు కోసం ఒత్తిడి తేవటంతో... చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ బంధువులకుసెల్ఫీ వీడియోపంపారు. బంధువులు ఘటనాస్థలికి వెళ్లి ఇద్దరినీ సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు, అక్కడి నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సురేష్ చనిపోగా, కొమరయ్య శనివారం ప్రాణాలొదిలాడు. మరోవైపుయువకుల ఆత్మహత్య కేసులో బుకీలు బాజి, తిరుపతిరావును పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.