ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్ఫీలు దిగుదామనుకున్నారు.. గల్లంతయ్యారు! - ఎస్సారెస్పీ కెనాల్​లో పడి ఇద్దరు గల్లంతు

పండుగ పూట ఆ ఇంట విషాదం మిగిలింది. కొత్త బట్టలు వేసుకుని ఫొటోలు దిగాలని పడిన సరదా ప్రమాదంలో పడేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. తెలంగాణలోని ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతవడం.. బాధిత కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

two boys missing in srsp canal
సెల్ఫీలు దిగుదామనుకున్న యువకులు కెనాల్​లో పడి గల్లంతు

By

Published : Jan 16, 2020, 7:58 AM IST

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఎస్సారెస్పీ కెనాల్​లో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సంక్రాంతిని పురస్కరించుకుని నూతన దుస్తులు ధరించి.. సెల్ఫీలు దిగేందుకు కెనాల్ వద్దకు నలుగురు యువకులు వెళ్లారు. ఇంతలో ప్రమాదవశాత్తు జారి ఇద్దరు కాలువలో పడ్డారు. గల్లంతైన ఇద్దరు యువకులు చిలుక రాంబాబు (20), చిలుక రాజేశ్​ (18) అన్నదమ్ములని.. వారు ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా అనుపాలెంకు చెందినవారని తోటి యువకులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details