గుంటూరు చుట్టూగుంట అన్ని రహదారులకు వేదిక...ఈ చుట్టూగుంట నుంచి హైదరాబాద్ చెన్నై, విజయవాడ మార్గాలు అన్ని కలుస్తాయి. పల్నాడు వాసులు గుంటూరు రావాలంటే ఇదే ప్రధాన రహదారి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారిపై రెండు అడుగుల మేర రంధ్రం పడి ప్రమాదకరంగా మారింది.
రోడ్డు మధ్యలో గుంత...మరమ్మత్తులు ఎప్పుడంటా..?
గుంటూరు ప్రధాన రహదారి మధ్యలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. ఇటీవల వర్షాలకు ఏర్పడిన ఈ గుంతకు మరమ్మత్తులు చేయకపోడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంత ఉందని గుర్తించేందుకు రోడ్డు మధ్యలో స్థానికులు చెట్ల కొమ్మలను పెట్టారు.
గుంటూరు ప్రధాన రహదారిపై చెట్లు, కొమ్మలు
వాహనాలు ఈ గుంతలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది గమనించిన స్థానికులు గుంత పడిన ప్రదేశంలో చెట్ల కొమ్మలు విరిచి పెట్టారు. రోడ్డు ప్రమాదకరంగా ఉన్నా ... మరమ్మతులు చేయడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.