గుంటూరు జిల్లా పేరేచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం గుంటూరు జిల్లా పేరేచెర్ల వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో కూలీ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని... క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడ్డవారికి కావాల్సిన సహాయం అందిస్తామని గల్లా భరోసా ఇచ్చారు.
ఇవి చూడండి...