ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - AP LATEST NEWS

.

top news
top news

By

Published : Dec 12, 2022, 6:59 PM IST

  • గడువులోగా పోలవరం పూర్తి కావటం కష్టం: కేంద్రం
    Central Government On Polavaram: పోలవరం ప్రాజెక్ట్​ నిర్మాణంపై కేేంద్ర జల్​శక్తిశాఖ వివరణ ఇచ్చింది. ఎంపీ సుభాష్​ చంద్రబోస్​ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్​ జల్​శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానిమిచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. తేల్చిచెప్పిన కేంద్రం
    NO SPECIAL STATUS FOR AP : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాండౌస్​ ముప్పు.. అతలాకుతలమైన రాష్ట్రం.. నేలరాలిన పంటలు
    RAINS IN ANDHRA PRADESH : మాండౌస్​ తుపాన్​ ప్రభావంతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉద్యానవన పంటలు నేలరాలడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'నష్టపోయిన రైతులను సీఎం పట్టించుకోవడం లేదు'
    Gidugu comments on CM: మాండౌస్ తుఫాను వలన నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంటను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ర్యాగింగ్‌పై సినీఫక్కీలో 'పోలీస్‌ పంచ్'.. 'మెడికల్​ స్టూడెంట్'​లా లేడీ పోలీస్​ గెటప్​
    వైద్య కళాశాలలో ర్యాగింగ్ కేసును పోలీసులు పక్కా స్కెచ్‌తో ఛేదించారు. మారువేషాల్లో కాలేజ్​లోకి ప్రవేశించి నిందితులను పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెళ్లిలో భోజనం ప్లేట్​ తాకాడని దళితుడిపై దాడి.. కుటుంబసభ్యులనూ చితకబాది..
    ఉత్తర్​ప్రదేశ్​లో​ దారుణ ఘటన జరిగింది. భోజనం ప్లేటు తాకాడని ఓ దళితుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. అనంతరం అతడి కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రిషి సునాక్‌ ముందు మరో సవాల్‌.. పన్నులకు వ్యతిరేకంగా 40 ఎంపీల లెటర్​
    బ్రిటన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రధాని రిషి సునాక్‌కు సవాల్‌ విసురుతోంది. తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సొంత పార్టీ ఎంపీలే ప్రశ్నిస్తున్నారు. దేశంలో పన్నులు ఎక్కువగా ఉన్నాయని వాటిని తక్షణమే తగ్గించాలని టోరీ ఎంపీలు బ్రిటన్‌ ఆర్థికమంత్రికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డబ్బు విషయంలో ఈ భయాలున్నాయా? అయితే ఇది మీ కోసమే!
    Money Fears : మనలో చాలా మంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతుంటాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటి.. వాటిని ఎలా అధిగమించాలో చూద్దామా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సూర్యతో పాటు ఆ ఇద్దరికి ప్రమోషన్​.. రహానె, ఇషాంత్​కు షాకిచ్చిన బీసీసీఐ
    భారత క్రికెట్‌ ఆటగాళ్ల భవతవ్యాన్ని నిర్దేశించే బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ డిసెంబర్‌ 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 12 ప్రధానాంశాలను అజెండాపై బీసీసీఐ దృష్టి సారించనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా క్రికెటర్లకు గ్రేడ్‌లు ఇవ్వడంతో పాటు జెర్సీ, కిట్‌ స్పాన్సర్లపై చర్చలు జరగనున్నాయి. అజింక్యా రహానే, ఇషాంత్‌ శర్మలను వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌లను తొలగించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • షారుక్ దీపిక బేషరమ్​ ఫొటోస్​ చూశారా
    బాలీవుడ్ బాద్​ షా నటించిన పఠాన్​ సినిమా నుంచి రొమాన్స్ సాంగ్ బెషరమ్ రంగ్ రిలీజైంది. అయితే ఇందులో దీపిక బికినీ అందాలను ఫుల్​గా ఆరబోసేసింది. షారుక్​తో కలిసి రొమాన్స్​ చేస్తూ కుర్రాళ్లకు కిక్​ ఇచ్చింది. దీంతో ఈ పాటలోని దీపిక బికినీ స్టిల్స్​ సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఓ సారి ఆ లుక్స్​ను మీరు చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details