- రాష్ట్రంలో మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన : సీఎం
CM JAGAN TOUR IN SRIKAKULAM : రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల సర్వే జరుగుతోందని.. మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు పత్రాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం.. డిసెంబర్ 5న దిల్లీకి పయనం
CBN DELHI TOUR : టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి.. ఆయన హాజరుకానున్నారు. ఈమేరకు సమావేశానికి రావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే.. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి?: లోకేశ్
LOKESH ON MP MOBILE MISSING : ఎంపీ విజయసాయి ఇంట్లోనే దొంగలు పడితే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులంతా ఫోన్ వెతకటం కోసం వెళ్తే.. సామాన్యుల భద్రత ఎవరు చూస్తారని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రజల్ని మోదీ, జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి'
CPI Leaders Narayana, Ramakrishna Comments: మోదీ ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటే, జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రధానిపైనా చర్యలు తీసుకోగల సీఈసీ అవసరం : సుప్రీంకోర్టు
ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గురువారం తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- EWS రిజర్వేషన్ తీర్పుపై కాంగ్రెస్ నేత రివ్యూ పిటిషన్
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ రిజర్వేషన్లు దేశంలో సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడమేనని, ఇది వివకక్షకు దారితీస్తుందని పిటిషనర్ ఆరోపించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భూకంపం దెబ్బకు రోడ్లపైకి తుర్కియే ప్రజల పరుగులు
తుర్కియే దేశాన్ని భూకంపం వణికించింది. 5.9 తీవ్రతతో నమోదైన భూకంపం ధాటికి తుర్కియే చిగురుటాకులా గజగజలాడింది. ఈ దుర్ఘటనలో 50మందికి పైగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జడ్డూ పునరాగమనం డౌటే.. ఆ టెస్టు సిరీస్‌లో సూర్య ఎంట్రీ
మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ వివరాలు.. మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వారి ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- '2047 నాటికి 40లక్షల కోట్లకు భారత ఆర్థిక వ్యవస్థ'.. అంబానీ అంచనా
2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయితో పోలిస్తే, 13 రెట్లు పెరగొచ్చని రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ అంచనా వేశారు. అగ్రస్థానంలో ఉన్న మూడు దేశాల జాబితాలోకి భారత్ చేరుతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అకీరా కోసం రంగంలోకి అడివి శేష్.. గ్రాండ్‌గా ఎంట్రీ ప్లాన్!
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సిల్వర్‌స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే అది కార్యరూపం దాల్చనుందని, ఇందుకోసం యంగ్ హీరో అడివి శేష్ కథ అందించబోతున్నారని తెలిసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.