గుంటూరు మిర్చియార్డుకు వరుసగా రెండోరోజూ భారీగా సరకు వచ్చింది. ఇవాళ లక్షా 50వేల టిక్కీలు యార్డుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం 2లక్షల టిక్కీలు వచ్చాయని.. అందులో ఇంకా 40వేల టిక్కీలు మిగిలిపోయినట్లు వెల్లడించారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావటంతో యార్డులో పాత నిల్వలు పేరుకుపోయాయి. పాత సరకు లక్ష టిక్కీలు, నిన్నటివి 40వేల టిక్కీల వరకూ ఉండిపోయాయి. ఇవాళ కూడా సరకు ఎక్కువగా రావటంతో మిర్చియార్డు నిండిపోయింది.
సరకుతో నిండిన గుంటూరు మిర్చియార్డు.. రేపు సెలవు - గుంటూరు మిర్చీ యార్డు సెలవులు
గుంటూరు మిర్చీ యార్టుకు రేపు సెలవు ప్రకటించారు. యార్డు సరకు నిండిపోవటంతో.. అమ్మకాలు పూర్తి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిర్చియార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు.
యార్డులో సరకు ఎక్కువ కావటంతో.. వాహనాలు లోపలకు రావటానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉన్న సరకు లావాదేవీలు జరిగి బయటకు వెళ్తేనే కొత్త సరకును విక్రయించటం వీలవుతుంది. మంగళవారం నాడు యార్డు తెరిచారు. దీంతో రెండు రోజుల నుంచి సరకు భారీగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. యార్డుకు రేపు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం మిర్చియార్డులో ఉన్న సరకు అమ్మకాలు పూర్తి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. రైతులు ఈ విషయం గమనించి రేపు యార్డుకు సరకు తీసుకురావొద్దని సూచించారు. మళ్లీ శుక్రవారం నాడు మిర్చియార్డులో కార్యకలాపాలు ఉంటాయన్నారు.
ఇదీ చదవండి: నందిగామలో కొనసాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు..