Formula E racing in Hyderabad: ఇండియాలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్ జరగనుంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్‌పై ఈవెంట్ జరగనుంది. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
ఈవెంట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈఓ దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉంటారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
Nagarjuna reaction Formula E racing: ఫార్ములా ఈ రేసింగ్‌పై టాలీవుడ్ కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. దానిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇక నాగార్జున మాట్లాడుతూ... ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ అతిథ్యం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టిలకు థ్యాంక్స్ చెప్పారు. ఈ రేస్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.