Thugs tried to kidnap a ten year old girl: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం జలాలుపురం గ్రామంలో.. పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. ముఖాలకు మంకీ క్యాప్ లు వేసుకుని వచ్చిన సదరు వ్యక్తులు.. చలిమంట కాచుకుంటున్న బాలికను పట్టుకునే ప్రయత్నం చేశారు. సదరు చిన్నారి ప్రతిఘటించడంతో రాడ్తో తలపై మోదారు. బాలిక తప్పించుకునే యత్నంలో పెద్దపెద్దగా కేకలు వేయడంతో.. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. దీంతో.. దుండగులు పరారయ్యారు.
గ్రామంలో తమకెవరూ శత్రువులు లేరని.. బాలికను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారో అర్థంకావడం లేదని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.