ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దా'రుణ' యాప్​ కేసులో మరో ముగ్గురు అరెస్టు - app loan case latest news

దారుణ యాప్​ కేసులో మరో ముగ్గురిని తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు చెందిన 10 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. అందులో రూ.3 కోట్లు ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. 20 వేలమంది బాధితులను నిందితులు మోసం చేశారని వెల్లడించారు.

cyberabad cp sajjanar
దా'రుణ' యాప్​ కేసులో మరో ముగ్గురు అరెస్టు

By

Published : Feb 8, 2021, 2:19 PM IST

అధిక వడ్డీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను.. తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. మోసాల్లో కీలకంగా వ్యవహరించిన మరో ఇద్దరు చైనీయులు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్​ వెల్లడించారు. దాదాపు 20 వేల మంది బాధితుల నుంచి 50 కోట్ల రూపాయలకుపైగా మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితులకు చెందిన 10 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అందులో రూ.3 కోట్లు ఉందన్నారు.

దా'రుణ' యాప్​ కేసులో మరో ముగ్గురు అరెస్టు

ముందుగా డబ్బు డిపాజిట్‌ చేస్తే 90 రోజుల వ్యవధిలో 4 రెట్లు అధికంగా తిరిగి చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారని సజ్జనార్‌ తెలిపారు. రుణ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి తీసేయడంతో... వాట్సాప్‌ ద్వారా లింక్‌లు పంపించి దోపిడీ చేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details