ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిద్రమత్తులో డ్రైవర్.. డివైడర్‌ను ఢీ కొన్న కారు.. ముగ్గురు మృతి - Kattanguru Accident

Road Accident at Kattanguru: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్​ను ఢీ కొట్టిన కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పొగా.. మరో ఆరుగురికి గాయలయ్యాయి.

Kattanguru car accident
కారు బోల్తా

By

Published : Jan 8, 2023, 9:24 AM IST

Road Accident at Kattanguru: వివాహానికి హాజరై వెళ్తుండగా డివైడర్‌ ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు యువకులకు గాయాలయ్యాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం యరసానిగూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతదేహాలు నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతులు ఖమ్మం ఖిల్లా బజార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో వివాహానికి హాజరై ఖమ్మం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details