EWS CERTIFICATES : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీచేసింది. ఈనెల 28వ తేదీ లోపు కానిస్టేబుల్, జనవరి 18వ తేదీ వరకు ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. కుటుంబ వార్షికాదాయం 8 లక్షల రూపాలయల కన్నా తక్కువ ఉన్న వారు ఈడబ్ల్యూఎస్‌కు అర్హులేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో 73ని జారీ చేసినా అది అమలుకు నోచుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాను రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాలకు ఇప్పటికీ అందజేయలేదు. దీంతో వేలాది మంది ఈడబ్ల్యూఎస్ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల కోసం అభ్యర్థుల ఇక్కట్లు.. - economically weaker section
EWS CERTIFICATES: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో 73ని జారీ చేసినా అది అమలుకు నోచుకోవడం లేదు.
EWS CERTIFICATES