Agriculture land issue's in vijayawada: రాష్ట్రంలో వివిద కారణాలను చూపిస్తూ కొందరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. పారిశ్రామికీకరణ పేరుతో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని బడా బాబులకు కట్టబెటుతున్నారని సంఘం నేతలు ఆరోపించారు. విజయవాడ ఎంబి భవన్లో జరిగిన రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ సమావేశంలో.. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచాలి: వ్యవసాయ కార్మిక సంఘం - అన్యాక్రాంతమైన భూముల వార్తలు
Agriculture land issue's meeting in vijayawada: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాక్రాంతమైన 15 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ ఎంబీ భవన్లో భూమి హక్కుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ నిర్వాసితులు భారీగా పాల్గొన్నారు. కోనేరు రంగారావు భూ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల పేదల భూమి ఆక్రమణకు గురైందని.. వాటిని పేదలకు తిగిరి ఇస్తానని గతంలో అనేక మంది నేతలు మాటలు ఇచ్చారని.. అవి ఇప్పటివరకు పేదలకు మాత్రం భూమి దక్కటం లేదని నేతలు ఆరోపించారు. భూమి కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెడుతున్నారన్నారు. గతంలో కోనేరు రంగారావు ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రభుత్వ భూములపై అధ్యయనం చేశారు. కమిటీ 104 సిఫార్సులు చేసింది. వాటిలో కొన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో భూమిలేని ప్రతి ఒక్కరికీ రెండు ఎకరాల భూమిని ఇవ్వొచ్చని గతంలో కోనేరు రంగారావు అన్నారు. భూమి ఇవ్వలేకపోయిన చోట.. కొబ్బరి చెట్లు ఇచ్చి రైతులను ఆదుకోవచ్చన్నారు. కానీ అభివృద్ధి పేరుతో బడాబాబులకు అడ్డగోలుగా భూములు ఇస్తున్న ప్రభుత్వం, సాగు చేస్తున్న పేదలకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: