YCP MP Raghuramakrishnam Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాని ఫిర్యాదులు వివరాలు ఇవ్వాలని హోమ్ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామకృష్ణరాజుకు అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. తనపై ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే రఘురామకృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. వివరాలు ఇవ్వకపోవడంతో హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఉమేష్‌చంద్ర వాదించారు. ప్రభుత్వం తరపున వాదనలు హోమ్ శాఖ న్యాయవాది వినిపించారు. ఉమేష్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రఘురామకృష్ణరాజుపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాద్ రాయ్ ఆదేశించారు. కేసు విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేయింది.
ఆ కేసుల వివరాలివ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం
YCP MP Raghuramakrishnam Raju: తనపై నమోదైన కేసు వివరాలు చెప్పేలా డీజీపీని ఆదేశించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం రఘురామపై నమోదైన కేసులు, ఫిర్యాదుల గురించి పూర్తి వివరాలు తెలపాలని.. హోంశాఖ, డీజీపీకి ఆదేశించి తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
Last Updated : Jan 6, 2023, 5:02 PM IST