పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో ఈ నెల 21 నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నూతన మెనూ అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అన్ని చోట్లా ఒకే రకమైన నాణ్యత, రుచి ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు వెల్లడించారు. పథకం అమలుకు నాలుగు అంచెల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రుల కమిటీ, గ్రామ సచివాలయంలో సిబ్బంది, సెర్ప్ నుంచి తనిఖీలు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా డివిజన్ల వారీగా గుడ్లు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ కాంట్రాక్టునూ వికేంద్రీకరణ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
'21 నుంచి అన్ని పాఠశాలల్లో నూతన మెనూ' - మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నూతన మెనూను ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ పథకం అమలుకు నాలుగు అంచెల పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
'the new menu will be implemented in all schools across the state from the 21st'