AP HIGH COURT: రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా, భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా.. రాజధానేతరులకు అమరావతిలో ఇళ్లస్థలాలు ఇస్తామనడం చట్టవిరుద్ధమని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టుకు నివేదించారు. నిర్దిష్ట అవసరం కోసం రైతులు ఇచ్చిన భూములను అమరావతి బృహత్తర ప్రణాళికకు విరుద్ధంగా ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. సీఆర్‌డీఏ సవరణ చట్టం ఆధారంగా రాజధానేతరులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.తాజాగా జరిగిన విచారణలో రైతుల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం తరఫు వాదనల కోసం విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్ టి.మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పై రాజధాని రైతులు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది .
రాజధాని అమరావతిలో స్థానికేతరులకు స్థలాలపై విచారణ వాయిదా
AP HIGH COURT: రాజధాని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తామనే విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫు వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ తరఫు వాదనల విచారణ కోసం మంగళవారానికి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు