బాపట్ల పట్టణంలోని సూర్యలంక బీచ్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శనివారం హైదరాబాద్‌కు చెందిన కొందరు ఈ బీచ్‌ను చూసేందుకు బయలుదేరారు. కొద్ది సేపట్లో బీచ్‌కు చేరుకుంటామనగా... తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారు టైర్ ఒక్కసారిగా పగిలిపోయింది. బ్యాంక్ కాలనీ వద్ద అదుపుతప్పి వాణిజ్య సముదాయాలపైకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులను భయభ్రాంతులకు గురయ్యారు. చివరికి ఓ దుకాణం మెట్లపైకి వెళ్లి కారు ఆగింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కథ.. సుఖాంతం కావటంతో స్థానికులూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యలంకలో తెల్లవారుజామున కారు హల్చల్.. - gurtur
తెలవారుతుండగా ఓ కారు హల్చల్ చేసింది. సూర్యలంక వాసులను భయానికి గురిచేసింది. "ఎర్రకారు" సినిమా షూటింగ్‌ను తలపించేలా దూసుకొచ్చింది. చివరికి ఓచోట మెట్లు ఎక్కేసి శాంతించింది.
సూర్యలంకలో తెల్లవారుజామున కారు హల్చల్..