Tadepalli rape case: పోలీసులకు సవాలుగా తాడేపల్లి అత్యాచార ఘటన కేసు! - విజయవాడలో యువతిపై అత్యాచారం
17:13 June 26
rape incident : కీలక నిందితుడి కోసం పోలీసుల గాలింపు
గుంటూరు జిల్లా సీతానగరంలో అత్యాచార ఘటన కేసు(rape incident case) పోలీసులకు సవాల్‌గా మారింది. ఘటన జరిగి 8 రోజులవుతున్న తరుణంలో నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. కొందరి వద్ద కుదవపెట్టిన బాధితుల సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం(seize) చేసుకోవడంతో కొంతవరకు నిందితులపై స్పష్టత వచ్చింది. కీలక నిందితుడు తప్పించుకు తిరుగుతుండగా.. అనుమానితుడి ఫోటోలతో రెండు జిల్లాల్లో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
రైల్వేకట్టలు, కృష్ణానది కరకట్ట వెంబడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన పోలీసు అధికారులను మళ్లీ రప్పించి కేసు విచారణ(enquiry)ను త్వరగా ముగించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు దర్యాప్తు కొనసాగిస్తూనే.. నదిలో రాత్రి సమయాల్లో గస్తీ(patrolling)ని ముమ్మరం చేశారు.
ఇదీచదవండి.