ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ తాడేపల్లి రైతుల ఆందోళన - యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ రైతుల ఆందోళన

యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి వస్తే నెలలో యూ-1 జోన్ ఎత్తివేయిస్తామన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు నోరెత్తడం లేదని రైతులు మండిపడుతున్నారు.

యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ తాడేపల్లి రైతుల ఆందోళన
యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ తాడేపల్లి రైతుల ఆందోళన

By

Published : Apr 5, 2022, 5:16 PM IST

అధికారంలోకి వస్తే నెలలో యూ-1 జోన్ ఎత్తివేయిస్తామన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు నోరెత్తడం లేదని రైతులు మండిపడుతున్నారు. యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ర్యాలీ తర్వాత తాడేపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి.. సీఎం హెలిప్యాడ్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు దిగారు. జోన్ అంశం తేల్చకుండా.. న్యాయస్థానంలో ఉందంటూ ఆళ్ల తప్పించుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోమని రైతులు తేల్చిచెప్పారు.

యూ-1 జోన్ అంటే..:గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి పరిధిలోని అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్​గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్​ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్​ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి: CM delhi tour: సీఎం జగన్​ దిల్లీ పర్యటన.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ

ABOUT THE AUTHOR

...view details