గుంటూరు మేడికొండూరు మండలం పాలడుగులో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులు తాళలేక ఆనందరావు అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల రోజుల క్రితం పాలడుగు అడ్డరోడ్డు వద్ద జరిగిన సామూహిక అత్యాచారం కేసులో విచారణ పేరుతో పోలీసులు ఆనందరావుని స్టేషన్కు పిలిపించారు. పదేపదే స్టేషన్కు పిలిచి విచారిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనందరావు భార్య చెబుతున్నారు. కౌలు చేస్తున్న పొలంలోనే పురుగు మందు తాగిన ఆనందరావు అక్కడే మరణించారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులపై గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేశారు.
SUICIDE: కౌలు రైతు ఆత్మహత్య.. పోలీసుల వేధింపులేనా..! - farmer suicide at medikondur
గుంటూరు మేడికొండూరు మండలం పాలడుగులో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులు తాళలేక ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆతని భార్య ఆరోపిస్తున్నారు.
farmer died at medikondur