ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల ధర్నాలో ఉద్రిక్తత.. కిందపడిపోయిన సీపీఎం నేత

పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ తుళ్లూరు మండలం మందడంలో ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ధర్నా రసాభాసగా మారింది. సచివాలయం పేరుతో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపైకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

Tension in sanitation workers'  protest at mandadam
పారిశుద్ధ్య కార్మికుల ధర్నాలో ఉద్రిక్తత

By

Published : Jan 11, 2021, 1:27 PM IST

పారిశుద్ధ్య కార్మికుల ధర్నాలో ఉద్రిక్తత

ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ రాజధాని ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. తుళ్లూరు మండలం మందడంలో వారు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తతకు దారి తీసింది. తోపులాట చోటు చేసుకోగా.. సీపీఎం నేత బాబూరావు కిందపడిపోయారు.

పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు రహదారిపై బైఠాయించి... వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. జీతాలివ్వని గుత్తేదారు సంస్థపై చర్యలు తీసుకోకుండా తమపైనే పోలీసులు జులుం ప్రదర్శించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details