గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. గత వారంరోజులుగా తాగు నీటి సమస్య వెంటాడుతున్నందున పేటేరు-రేపల్లె ప్రధాన రహదారి పై డ్రమ్ములను అడ్డంగా ఉంచి నిరసన తెలిపారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన తమ గోడు వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రేపల్లె పురపాలక కమీషనర్ అంజయ్య అక్కడికి చేరుకుని వారి సమస్యలు విన్నారు. . నీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని చెప్పి... వెంటనే ట్యాంకర్లలో నీరు తెప్పించారు.దీంతో పట్టణవాసులు రాస్తారోకో విరమించారు.
రేపల్లెలో నీటి కోసం స్థానికుల రాస్తారోకో - tenali
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో స్థానికులు ధర్నా చేపట్టారు. వారం రోజులుగా నీరురావడంలేదని డ్రమ్ములతో నిరసనకు దిగారు.
రేపల్లెలో నీటి కోసం స్థానికుల రాస్తారోకో