ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్ లైన్​ వారియర్స్​గా గుర్తించాలి' - Guntur district latest news

వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికుల యూనియన్​ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐటీయూ నాయకులు.. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్​ జశ్వంతరావుకు వినతిపత్రం అందజేశారు.

తెనాలి మున్సిపల్ కార్మికుల యూనియన్
తెనాలి మున్సిపల్ కార్మికుల యూనియన్

By

Published : May 30, 2021, 7:30 PM IST

పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్ లైన్​ వారియర్స్​గా గుర్తించి కనీస సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ ఏరియా కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. కార్మికుల(municipal workers) సమస్యలను వెంటనే పరిష్కరించాలని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ జశ్వంత రావుకు వినతిపత్రం అందజేశారు. జూన్​ 4వ తేదీలోపు తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులను కలుపుకొని పెద్దఎత్తున నిరసన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో పనిచేస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కార్మికులు వాపోయారు. రావాల్సిన నగదు ఇప్పటికీ తమ ఖాతాల్లో జమ కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది కార్మికులది ఇదే సమస్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.

రాతపూర్వకంగా ఇస్తే పరిష్కరిస్తాం..

కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాతపూర్వకంగా అందజేస్తే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇప్పటికే మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశాం. ఇంకా అవసరమైతే పంపిణీ చేస్తాం. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. -జశ్వంత్ రావు, తెనాలి మున్సిపల్ కమిషనర్



ఇదీ చదవండి..

CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

ABOUT THE AUTHOR

...view details