ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అండర్-19 క్రికెటర్​ షేక్​ రషీద్​కు సీఎం అభినందనలు - Sheikh Rashid meet CM Jagan

టీమిండియా అండర్-19 వైస్ కెప్టెన్ష్ షేక్ రషీద్​ను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. సొంత ఇంటి స్థలం లేదని చెప్పడంతో గుంటూరులో ఇంటి స్థలం మంజూరు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రషీద్.. రాబోయే రోజుల్లో దేశం కోసం బాగా ఆడి.. రాష్ట్రానికి పేరు తెస్తానని చెప్పారు.

Team India Under-19
Team India Under-19

By

Published : Feb 16, 2022, 8:17 PM IST

టీమిండియా అండర్-19 వైస్ కెప్టెన్, గుంటూరుకు చెందిన షేక్ రషీద్.. ముఖ్యమంత్రి జగన్​ను కలిశారు. తాడేపల్లిలోని కాంప్యు కార్యాలయంలో కలిసిన రషీద్​ను.. సీఎం అభినందించారు. షేక్ రషీద్ సాధించిన విజయంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

రషీద్ కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారని.. సొంత ఇంటి స్థలం లేదని చెప్పడంతో గుంటూరులో ఇంటి స్థలం మంజూరు చేయాలని ఆదేశించారని చెప్పారు.

రషీద్​కు ప్రభుత్వం తరపున రూ.10లక్షల ప్రోత్సాహకం అందించారని.. ఉద్యోగ అర్హత రాగానే కోరుకున్న విభాగంలో ఉద్యోగం ఇవ్వాలని సీఎం చెప్పారని తెలిపారు. రషీద్​కు ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ మరో రూ.పది లక్షలు ప్రోత్సాహకం అందించింది.

అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు - షేక్ రషీద్..

"నాకు ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ చాలా మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నన్ను అభినందించి ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింత బాగా ఆడి రాష్ట్రానికి పేరు తెస్తా" - షేక్ రషీద్, టీంఇండియా అండర్ -19 వైస్ కెప్టెన్

ఇదీ చదవండి

under-19 world cup: అండర్‌-19 వరల్డ్‌కప్​లో సత్తా చాటిన.. మన కుర్రాడు!

ABOUT THE AUTHOR

...view details