ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంగం డెయిరీ ప్రభుత్వ ఆస్తి కాదు..: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ - డెయిరి డెవలప్మెంట్ ఫెడరేషన్

సంగం డెయిరీ ప్రభుత్వ రంగం ఆస్తి కాదని.. అది పాడి రైతుల ఆస్తి.. దానిని ఎవరూ స్వాధీనం చేసుకోలేరని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టం చేశారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల రైతుల కృషి వల్లే ఇది ఏర్పడిందని ఆయన అన్నారు. డెయిరీలపై ప్రభుత్వం ఆరాచకాలు చేస్తుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన నిడుబ్రోలు పశువైద్యశాలను రెండు సార్లు ప్రారంభించగా.. మళ్లీ దానినే మంత్రి సీదిరి ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. అమూల్ సంస్థ నుంచి కోట్లాది రూపాయలు లంచాలు తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

నరేంద్ర
narendra

By

Published : Dec 15, 2022, 11:32 AM IST

Updated : Dec 15, 2022, 1:04 PM IST

TDP senior leader Dhulipalla Narendra Coments on ap government: గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్​ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. మంత్రి అప్పలరాజు ప్రారంభించిన వెటర్నరీ హాస్పిటల్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసి పూర్తి చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ హాస్పటల్​ను తిరిగి ప్రారంభించి మేమే చేశామని చెప్పుకోవటం సిగ్గుచేటని అన్నారు. అంతేకాకుండా ఒక హాస్పటల్ భవనాన్ని రెండుసార్లు ప్రారంభించడం వైసీపీకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు లక్ష పశువులు చనిపోయాయని, నష్టపరిహారం కింద గేదెలకు రూ.30000 ఆవులకు రూ.15000 నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు.

గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల రైతుల కృషివల్లే సంగం డైరీ ఏర్పడిందే కానీ నీలాంటి బుక్కా పకీర్ల దయాదాక్షిణ్యల మీద ఏర్పడింది కాదు సంగం డైరీ... ఆ రోజుల్లో ఊరూరు తిరిగి రైతులను సమీకరణం చేసి రైతు సంఘాలు ఏర్పాటు చేసి పాల సేకరణ చేయడం వల్ల సంగం డెయిరి అంచలంచెలుగా అభివృద్ధి చెందింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెయిరి డెవలప్మెంట్ ఫెడరేషన్ ను చాపల చుట్టి మూల పడవేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే...ఎంతోమంది రైతుల శ్రమతో నడుస్తున్న సహకార డైరీల ను నిర్వీర్యం చేసి అమూల్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు స్వలాభం చేకూర్చేందుకు మీ వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తున్న మాట వాస్తవమా కాదా, అమూల్ డెయిరి కొరకు ప్రభుత్వపరమైన రాయితీలను, విలువైన కోట్ల భూములను అమూల్ కు దారాదత్తం చేస్తున్న మాట వాస్తవం కాదా, అని సూటిగా ప్రశ్నించారు.

ఇవీ చదవండి

Last Updated : Dec 15, 2022, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details