గుంటూరు అడవి తక్కెళ్లపాడు వద్ద నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందచేయాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అడవి తక్కెళ్లపాడులోని టిడ్కో గృహాల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'నా ఇల్లు నా సొంతం' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'సీఎం జగన్ మొండి వైఖరి మానుకోవాలి' - tdp protest for tidco houses
గుంటూరు అడవి తక్కెళ్లపాడు వద్ద ఉన్న టిడ్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలని తెదేపా నేతలు ఆందోళన చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. టిడ్కో గృహాల ఎదుట బైఠాయించి 'నా ఇల్లు నా సొంతం' అంటూ నినాదాలు చేశారు.
తెదేపా నేతల నిరసన
తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందచేయకుండా వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యులకు పాల్పడుతుందని తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన మొండి వైఖరిని మానుకుని ఇప్పటికైనా అర్హులకు గృహాలు మంజూరు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉంది.... బోరుమన్న వైకాపా బహిష్కృత నేత'