ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి తెదేపా ర్యాలీ చేపట్టింది. వర్షాలకు దెబ్బతిన్న పంట కంకుల్ని పట్టుకుని నిరసన చేపట్టారు.

tdp protest at sachivalya fire station
రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ

By

Published : Nov 30, 2020, 9:47 AM IST

Updated : Nov 30, 2020, 11:46 AM IST

రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వరి కంకుల్ని చేతబట్టి తెదేపా నేతలు సచివాలయం సమీపంలో నిరసన తెలిపారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల తరఫున ఆందోళనలు చేశారు. అన్నదాతలకు కలిగిన నష్టాన్ని తెలిపే రీతిలో వర్షానికి దెబ్బతిన్న కంకులతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యాన పంటలకు రూ.50 వేలు, ముంపు బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అంతకుముందు వెంకటపాలెం బీసీ కాలనీలో ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.

ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి
వైకాపా ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కలిసి వెంకటపాలెం బీసీ కాలనీలో ఎన్టీఆర్​ విగ్రహానికి నివాళులర్పించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: సభాక్షేత్రంలోకి అస్త్రశస్త్రాలతో తెలుగుదేశం పార్టీ..!

Last Updated : Nov 30, 2020, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details