కోడెల పార్ధివదేహాన్ని రేపు ఉదయం 6గంటలకు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాకు తెదేపా నేతలు తీసుకురానున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు స్వయంగా కోడెల పార్ధివ దేహాన్ని వెంట తీసుకురానున్నారు. రోడ్డుమార్గం ద్వారా సూర్యాపేట, విజయవాడ మీదుగా మధ్యాహ్నం గుంటూరు చేరనున్నారు. అనంతరం అక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్ది సేపు ఉంచుతారు. ఆ తర్వాత కోడెల స్వస్థలానికి తీసుకెళ్లిఅంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రేపు స్వస్థలానికి కోడెల పార్ధివ దేహం - రేపు హైదరాబాద్ నుంచి ఆయన స్వస్థలానికి
కోడెల శివప్రసాదరావు పార్ధివదేహాన్ని రేపు హైదరాబాద్ నుంచి ఆయన స్వస్థలానికి తీసుకురానున్నారు. కోడెల భౌతికకాయంతో తెదేపా అధినేత చంద్రబాబు కూడా రానున్నారు.
రేపు స్వస్థలం చేరనున్న కోడెల పార్ధివ దేహం