సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ పెద్ద కుంభకోణమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. నెలల తరబడి శిక్షణ తీసుకున్న వారు సైతం ప్రశ్నాపత్రం ఎంతో కష్టంగా ఉందని చెబుతుంటే... ఎలాంటి శిక్షణ లేకుండా వెళ్లి పరీక్ష రాసిన వారికి టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్పై ఉందన్నారు. గ్రామ వాలంటీర్ల పోస్టులను వైకాపా కార్యకర్తలను పంచినట్టే.. సచివాలయ ఉద్యోగాలను కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ పెద్ద కుంభకోణం - jagan
గ్రామ వాలంటీర్ల పోస్టులను వైకాపా కార్యకర్తలకు పంచినట్టే సచివాలయ ఉద్యోగాలను పార్టీ కార్యకర్తలకు ఇచ్చేందుకు జగన్ కుట్రపన్నారని తెదేపా నేతలు ఆరోపించారు.
తెదేపా