రవాణా రంగాన్ని ఆదుకోవాలని.. లారీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని.. సీఎం జగన్కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. డీజిల్ పై పన్ను, టోల్ ట్యాక్స్ ధరలు తగ్గించడంతో పాటు ఇ-వే బిల్ సమయం పెంచి లారీ యజమానులకు ఉపశమనం కలిగించాలని కోరారు. తక్షణమే రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో లారీ డ్రైవర్లను ఆదుకున్న చంద్రన్న బీమా పథకాన్ని వైకాపా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయట్లేదని నిలదీశారు.
రవాణా రంగాన్ని ఆదుకోవాలి: సీఎం జగన్కు అనగాని లేఖ - రవాణా రంగంపై సీఎం జగన్కు అనగాని లేఖ వార్తలు
రాష్ట్రంలో ఇంధన ధరలు తగ్గించి రవాణా రంగాన్ని ఆదుకోవాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. కరోనా కారణంగా లారీ డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోయారన్నారు.
రవాణా రంగాన్ని ఆదుకోవాలి: సీఎం జగన్కు అనగాని లేఖ