సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవటాన్ని నిరసిస్తూ.. గుంటూరు జిల్లా పొన్నూరులో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. రహదారిపై వెనక్కు నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో తీసుకుంటున్న కక్షపూరిత చర్యలతో రాష్ట్ర అభివృద్ధి వెనక్కు వెళ్తోందని విమర్శించారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. కరోనా ఎక్కువగా ఉన్నందున ఆందోళనలకు అనుమతి లేదని చెప్పారు.
సంగం డెయిరీపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నేతల నిరసన - గుంటూరు జిల్లా తాజా వార్తలు
సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవటంపై తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పాడి రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తెదేపా నేతల నిరసన