అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు జయరాం, వెల్లంపల్లి శ్రీనివాస్‌లను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరాం.. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించి తన నిజాయితీని నిరోపించుకోవాలని తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వస్తున్న ఆరోపణలపైనా నిజనిజాలు బయటపెట్టాలన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిని తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు.
'అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలి' - గుంటూరులో తెదేపా నేతల నిరసన వార్తలు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు జయరాం, వెల్లంపల్లి శ్రీనివాస్‌లను తక్షణమే బర్తరఫ్ చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో నిరసన చేపట్టారు.
తెదేపా నేతల నిరసన